సీమ కరవు చిత్రం – రైతు బతుకు చిధ్రం…..

సీమ కరవు చిత్రం
రైతు బతుకు చిధ్రం…..
…………………………..
వసంతం లేక ఇక్కడి కోయిలలన్నీ వలస వెళ్ళాయి
ఇక్కడినదులు ప్రవహించటం ఈ తరం కథగా వింటోంది
రాయలకాలం లోని చెరువులన్నీ అన్యాక్రాంతం అయిపోయాయి
ఇక్కడి నేలలు నెర్రులు తెరచి ఆశగా, సాగే మేఘాన్ని అర్దిస్తూంది
జాలితోనైనా ఒక్క చినుకు బొట్టునైనా విదిల్చి పొమ్మని
ప్రతి ఏడూ బీళ్ళు అభివృద్ధి చెందుతున్నాయి
వేయిఅడుగుల బోర్ వెర్రిగా నవ్వింది .
చేసిన అప్పులకు భూమి తాకట్టులో చిక్కింది
రైతు కూలీగా మారి మరో అవతారం ఎత్తాడు
బ్యాంకులు పంచాయతీ ఆఫీసు ముందు వేలం పాట పాడుతున్నాయి
దిక్కు తోచని రైతు పంట కోసం తెచ్చిదాచిన మందు డబ్బాను అందుకొన్నాడు .
ఇదీ సీమ కరువు బ్రతుకు చిత్రం – ప్రతి రైతు బతుకులవుతున్నాయి చిధ్రం

Advertisements

పల్లెలో మా ఇల్లు

పల్లెలో మా ఇల్లు
—————
పల్లెలోమా ఇల్లు కండ్లు తెరిచి పదికాలాలయింది
నాలుగు తరాల మనుషులను కంటికి రెప్పలా కాచింది
చలిగాలుల్నుంచి , ఎండా వానల్నుంచీ
పొదిగిన కోడి తనపిల్లలను రెక్కకిన్ద కప్పినట్టు
నిద్రలో వులికిపడ్డ పురిటిబిడ్డను తల్లి పొదివి పట్టినట్టు
పల్లెలో మా ఇల్లు మాతోడు నీడై మాతో సాగింది

పొద్దున్నే నీళ్ళు తోడేతప్పుడుగిలకబావి చేసే చప్పుడ్లకూ,
తల్లిపిచుక మేతకోసం తుర్రుమనగానే పిల్ల పిచుకల కిచ కిచలకూ
పాలు చేపగానే , పక్కకు లాగేసిన లేగదూడ అంబా రవానికీ
కల్లాపి చల్లిన ముంగిట్లో ముగ్గులేసే ముగ్ధల సవ్వడ్లకూ
పల్లెలో మా ఇల్లు నవ్వుతూ మేలుకొని మురిసిపోయేది

వసారాలో తాతయ్య కొలువుతీరడం ఆలస్యం
సమస్యల హారాలతో తయారైన మా ఊరిజనం
ఆయన చెప్పిందే వేదం అన్నట్టు తలలూపుతూ
హారాలను విడిపూవులుగా పట్టుకెల్లడం తనకు పరిచయమే

తన ముందు తోటలో రాలిన పారిజాతాలనూ,
ప్రకృతి తనకు చేసిన పూజ అని మురిసి త్రుల్లేది
చిలుక కొరికిన బాదం కాయలు పిల్లలేరుకొంటే కొంటెగా నవ్వేది
బాటసారులేవరైనా తనపంచన సేదతీరితే పట్టలేని సంతోషాన మురిసేది

చినుకు చినుకూ ధారై చూరులోంచీ కారే నీటిని
దోసిళ్ళతో పట్టి చల్లుకునే పిల్లల నవ్వుతూ చూసేది
ధారగా సాగే ప్రవాహంలో కాగితపు పడవల గమనాన్ని గమనించేది
తడుస్తూ కొంటేపిల్లల వానా వానా వల్లప్పకు తాను స్వరం అయ్యేది

ముసలమ్మలాడే పరమపదసోపానపటం తానయ్యేది
ఊగే కుర్చీలో తాత పాడే తత్వానికి తనూ రాగం కలిపేది
ఉయ్యాల బల్లపై అమ్మ పాడే ఊర్మిళ నిద్రా , ఇంటిముందు ఆక్కలాడే తొక్కుడు బిళ్ళ
వసారా బండపై చెక్కిన పులీ మేకా , ఎన్ని జ్ఞాపకాలు ఎదలో దాచిందో !